: హరిరామజోగయ్యపై కేసు నమోదు చేయాలి: అచ్చెన్నాయుడు

మాజీ మంత్రి హరిరామజోగయ్యపై కేసు నమోదు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ, ఆత్మకథ పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిష్ఠకు భంగం కలిగే వ్యాఖ్యలు చేసిన హరిరామజోగయ్యను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మకథ పేరిట ఇష్టం వచ్చినట్టు రాసే రాతలకు అడ్డుకట్ట వేయాలంటే ఆయనను అరెస్టు చేయడమే సరైనదని ఆయన పేర్కొన్నారు. కాగా, వంగవీటి రంగా హత్యలో ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తం ఉందని హరిరామజోగయ్య 'అరవై వసంతాల నా రాజకీయ ప్రస్థానం' పేరిట రాసిన ఆత్మకథలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

More Telugu News