: అది ఉగ్రవాదుల పన్నాగం...వారికి అంత సీన్ లేదు: ఈజిప్టు అధ్యక్షుడు
అంతర్జాతీయ సమాజం ముందు ఈజిప్టుపై బురదజల్లే కుట్రలో భాగంగానే తాను రష్యా విమానాన్ని కూల్చేసినట్టు ఐఎస్ఐఎస్ ప్రకటించిందని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతేహ్ అల్ సిసి ఆరోపించారు. ఈజిప్టు ప్రతిష్ఠను దెబ్బతీసే పన్నాగంలో భాగంగా, అదే సమయంలో ఉగ్రవాదుల ప్రతిష్ఠను పెంచుకునేందుకే ఐసిస్ ఆ ప్రకటన చేసిందని ఆయన స్పష్టం చేశారు. ఐసిస్ కు అంత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం సాంకేతిక సమస్యల కారణంగానే రష్యా విమానం సినాయి పర్వతాల్లో కుప్పకూలిందని ఆయన తెలిపారు.