: రాజస్థాన్ లో మద్య నిషేధం కోసం ప్రాణం విడిచిన మాజీ ఎమ్మెల్యే
మద్యనిషేధం కోసం మాజీ ఎమ్మెల్యే ప్రాణాలు విడిచిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. రాజస్థాన్ లో మద్యనిషేధం విధించాలంటూ జనతాదళ్ మాజీ ఎమ్మెల్యే గురుచరణ్ చబ్రా అక్టోబర్ 2 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో అక్టోబర్ 17న బలవంతంగా ఆయనను ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా ఆయన నిరాహార దీక్ష కొనసాగించడంతో రెండు రోజుల క్రితం ఆయన కోమాలోకి జారుకున్నారు. నేడు ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆసుపత్రికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి రాజేంద్ర రాఠోడ్ నివాళులర్పించారు.