: కృష్ణా పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తాం: డీజీపీ అనురాగ్ శర్మ

వచ్చే సంవత్సరం నిర్వహించే కృష్ణా పుష్కరాలపై తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ ఇవాళ నల్గొండ జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తరువాత జిల్లా ఎస్పీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కరాల తరహాలోనే కృష్ణా పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తామని, అందుకు అధికారులు కృషి చేయాలని డీజీపీ సూచించారు. జిల్లాలో కొత్తగా 22 ప్రాంతాల్లో 30 పుష్కరఘాట్ లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో పుష్కరఘాట్లను నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

More Telugu News