: విజయవాడ కార్పొరేషన్ సమావేశం రచ్చరచ్చ
ఈ రోజు జరిగిన విజయవాడ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే తెలుగుదేశం, వైకాపా సభ్యుల మధ్య వాగ్వాదం మొదలైంది. అజెండాలో లేని అంశాలను టీడీపీ లేవనెత్తుతోందని వైకాపా సభ్యులు ఆరోపించారు. అంతేకాకుండా సమావేశానికి మున్సిపల్ కమిషనర్ రాకపోవడంపై వైకాపా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, ఇరు వర్గాల మధ్య తీవ్ర వాదన జరిగింది. ఈ క్రమంలో మేయర్ పై వైకాపా కార్పొరేటర్ బహదూర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితి వేడెక్కింది. బహదూర్ ను సస్పెండ్ చేస్తూ తీర్మానం చేసేందుకు టీడీపీ సభ్యులు సిద్ధం కావడంతో... వైకాపా సభ్యులు మేయర్ పోడియంను చుట్టుముట్టారు. ఈ క్రమంలో తీవ్ర గందరగోళం చెలరేగింది. అయితే, చివరకు బహదూర్ క్షమాపణలు చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.