: వెంకయ్యనాయుడికి సత్తా ఉంటే ప్రత్యేక హోదా ఇప్పించాలి: సీపీఐ రామకృష్ణ
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి సత్తా ఉంటే ప్రత్యేక హోదా ఇప్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సవాల్ చేశారు. లేదంటే తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రతి కళాశాల, యూనివర్సిటీకి వెళ్లి రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని వివరిస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మోదీ, వెంకయ్యల దిష్టిబొమ్మలను దహనం చేస్తామని విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా అడిగిన విద్యార్థులను బీజేపీ నేతలు కొడతారా? అని ప్రశ్నించారు. అరెస్టు చేసిన విద్యార్థులను విడిచిపెట్టి బీజేపీ కార్యకర్తలపై కేసులు పెట్టాలన్నారు. ఈ నెల 14న జలదీక్ష, డిసెంబర్ 2న ఢిల్లీలో ధర్నా నిర్వహించబోతున్నట్టు ఆయన వివరించారు.