: పత్తి రైతు కన్నెర్ర చేసిన వేళ..!
ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన పంటను విక్రయించే రైతన్నకు ఎన్నడూ గిట్టుబాటు ధర రాదు. తాము పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా ఆదాయం రావాలని కోరుకునే రైతు, అందుకోసం ధర్నాలు, నిరసనలు చేపట్టాల్సిన పరిస్థితి. అదే జరిగింది. ఈ సీజనులో పత్తికి మద్దతు ధర దొరకని రైతు కన్నెర్ర చేశాడు. ఈ ఉదయం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయానికి తీసుకొచ్చిన పత్తికి ఆఫర్ చేసిన ధర ఎంతమాత్రమూ సరిపోదంటూ దాడికి దిగారు. కార్యాలయం అద్దాలు పగులగొట్టారు. అక్కడి ఫర్నీచరును ధ్వంసం చేశారు. పత్తిలో తేమను 16 శాతానికి పెంచి, క్వింటాలుకు రూ. 6 వేల ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ, నిరసనకు దిగారు. రైతుల కన్నెర్రపై విషయం తెలుసుకున్న పోలీసులు పెద్దఎత్తున మార్కెట్ కార్యాలయానికి చేరుకుని రైతులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.