: ఈజిప్టు కు సెలవంటూ పోస్ట్ చేసిన తండ్రీకూతుళ్ల ఫొటో!

ఈజిప్టు పర్యటన ముగించుకుని ఎంతో సంతోషంగా బయలుదేరిన ఆ తండ్రీకూతుళ్లు, విమానం ఎక్కబోయే ముందు ఒక ఫొటో దిగారు. ఆ ఫొటోను రష్యాకు చెందిన ఒక మహిళ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ..‘ఈజిప్టుకు ఇక సెలవు...ఇంటికి వెళ్తున్నాము’ అంటూ ఒక క్యాప్షన్ కూడా రాసింది. విషాదమేమిటంటే, తమ జీవితాల నుంచి, ఈ భూమి పై నుంచి ఆ తండ్రీకూతుళ్లు శాశ్వతంగా సెలవు తీసుకోవాల్సి రావడం! నిన్న ఎయిర్ బస్ 321 విమానాన్ని ఐఎస్ ఉగ్రవాదులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ విమానంలోనే రష్యాకు చెందిన లూరీ బయలుదేరాడు. లూరీ విమానం ఎక్కబోయే ముందు తన మూడేళ్ల కూతురు అనస్తాషియా షీన్ ను ఎత్తుకుని ఫొటో కూడా దిగాడు. ఓల్గా షీన్ అనే రష్యా మహిళ ఆ ఫొటోకు క్యాప్షన్ రాసి సోషల్ మీడియాలో పెట్టింది. ఇదంతా జరిగిన కొన్ని నిమిషాల్లోపే వారు ప్రయాణిస్తున్న విమానం సినాయ్ సమీపంలో కూలిపోయింది.

More Telugu News