: జైలుకెళ్లి చోటా రాజన్ ను కలిసిన దౌత్యాధికారి

ఇండోనేషియాలోని బాలీలో ఇంటర్ పోల్ అధికారులకు పట్టుబడి ప్రస్తుతం జైల్లో ఉన్న అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ ను భారత దౌత్యాధికారి సంజీవ్ అగర్వాల్ కలిసి మాట్లాడారు. దాదాపు 45 నిమిషాల పాటు రాజన్ తో మాట్లాడిన ఆయన, అనంతరం ఇండోనేషియా ప్రభుత్వాధికారులతో చర్చించారు. మరో 20 రోజుల్లో రాజన్ ను ఇండియాకు పంపేందుకు వారు అంగీకరించినట్టు సంజీవ్ మీడియాకు తెలిపారు. కాగా, రాజన్ పై భారత్ లో వివిధ పోలీసు స్టేషన్లలో ఉన్న 70కి పైగా కేసుల గురించిన వివరాలతో ప్రత్యేక సీబీఐ అధికారుల బృందం ఇండోనేషియాకు వెళ్లనున్న సంగతి తెలిసిందే.

More Telugu News