: ప్రత్యేక హోదా సాధన కోసం ఇక 'మట్టి' పోరు: కాంగ్రెస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా 'మట్టి సత్యాగ్రహాన్ని' మొదలు పెట్టనున్నట్టు పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి తెలిపారు. ఈ ఉదయం తిరుమలకు వచ్చి వీఐపీ బ్రేక్ దర్శనంలో భాగంగా స్వామివారిని సేవించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చి ప్రజల చేతిలో మట్టి పెట్టిపోయిన ప్రధాని నరేంద్ర మోదీకి, రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి మట్టిని సేకరించి పంపించడం ద్వారా వినూత్న రీతిలో నిరసన తెలియజేయనున్నట్టు ఆయన వివరించారు. కాగా, తిరుమల శ్రీవెంకటేశ్వరుడిని ఈ ఉదయం ఏపీ మంత్రి నారాయణ, వైకాపా ఎంపీ మిధున్ రెడ్డి తదితరులు దర్శించుకున్నారు. వీఐపీలకు దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

More Telugu News