: వైకాపా ఎంపీ ఇంటి ముందు చంద్రబాబు అసహనం!
ఆకస్మిక తనిఖీల్లో భాగంగా చంద్రబాబునాయుడు నిన్న నెల్లూరులో పర్యటిస్తున్న వేళ, పార్లమెంట్ సభ్యుడు, వైకాపా నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంటి ముందున్న చెత్తను చూసి అసహనాన్ని వ్యక్తం చేశారు. నెల్లూరు గాంధీనగర్ వీధుల్లో వెళుతూ, ఈ ఇల్లు ఎవరిదని ఓ స్థానికుడిని ఉద్దేశించి చంద్రబాబు ప్రశ్నించగా, అది ఎంపీ మేకపాటిదన్న సమాధానం వచ్చింది.
"ఇంత పెద్ద ఇల్లు కట్టారు. శుభ్రత పాటించకుంటే ఎలా?" అన్నారు. "నెల్లూరు రెడ్లు పెద్ద పెద్ద ఇళ్లు కట్టుకుంటారుగానీ, ఇంటి ముందు పరిశుభ్రంగా ఉంచుకోరు" అని కూడా అన్నారు. ఆ పక్కనే ఉన్న ఖాళీ స్థలం కార్పొరేషన్ దేనని తెలుసుకున్న ఆయన, అక్కడ పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని కమిషనర్ కు ఆదేశాలిచ్చారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన, ఓ కొబ్బరి బోండాల వ్యాపారిని, మరో బాలికను, ఓ ఆటో డ్రైవర్ ను ఆత్మీయంగా పలకరించి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.