: వారికి వేల కోట్లు, నాపై వందల కేసులు: వరంగల్ వామపక్షాల అభ్యర్థి గాలి వినోద్
వరంగల్ పార్లమెంట్ స్థానానికి వామపక్షాల తరఫున పోటీ పడుతున్న తన చేతుల్లో ఓటమి తప్పదని భయపడుతున్న కేసీఆర్ సర్కారు, ఫోన్ ట్యాపింగ్ వంటి దారుణాలకు పాల్పడుతోందని గాలి వినోద్ కుమార్ ఆరోపించారు. తాను ఎవరెవరితో మాట్లాడుతున్నానన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఈ పని జరుగుతోందని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి తనపై వందల కేసులు ఉన్నాయని, ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్న ఇతర అభ్యర్థులకు వేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయని ఆయన అన్నారు. ప్రజల మద్దతుతో తన గెలుపు తథ్యమన్నారు.