: బంగారం బాండ్లపై ప్రభుత్వం ఇచ్చే వడ్డీ ఇదే!
నవంబర్ 26 నుంచి గోల్డ్ బాండ్లను జారీ చేయనున్న కేంద్ర ప్రభుత్వం వాటిపై 2.75 శాతం వడ్డీని ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 5వ తేదీ నుంచి బంగారం పెట్టుబడులను ఆహ్వానిస్తూ, దరఖాస్తులను స్వీకరిస్తారని, బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా నవంబర్ 20 వరకూ వచ్చిన దరఖాస్తులను స్వీకరించి, ఆపై బాండ్లను జారీ చేస్తామని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఒక గ్రాము యూనిట్ గా కనీసం రెండు యూనిట్ల నుంచి గరిష్ఠంగా 500 యూనిట్ల వరకూ ప్రజలు పెట్టుబడులు పెట్టవచ్చని తెలిపారు. వడ్డీని సాలీనా పొందవచ్చని వివరించారు. ఈ వడ్డీపై ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం పన్నులను చెల్లించాల్సి వుంటుంది.