: విషాదంలో రష్యన్లు...దిగ్భ్రాంతి చెందిన పుతిన్

ఈజిప్టు నుంచి రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ కు బయల్దేరిన రష్యన్ ఎయిర్ బస్ 321 విమానం సినాయ్ పర్వత ప్రాంతంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో 224 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో సింహభాగం రష్యాకు చెందిన టూరిస్టులేనని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రష్యన్లు విషాదంలో మునిగిపోయారు. విమాన ప్రమాదంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. విమాన ప్రమాదం వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఉన్నత స్థాయి కమిటీతో విచారణకు రష్యా ఆదేశించింది.

More Telugu News