: ఫుట్ బాల్ మ్యాచ్ ను ఎంజాయ్ చేసిన కోహ్లీ... స్టాండ్స్ లో కూర్చుని సెల్పీలతో సందడి
టీమిండియా టెస్టు కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ నిన్న మార్గోవాలో ప్రత్యక్షమయ్యాడు. ఇండియన్ సూపర్ లీగ్-2లో భాగంగా జరుగుతున్న ఫుట్ బాల్ మ్యాచ్ ను అతడు ఆస్వాదించాడు. పుణే, గోవా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ను స్టాండ్స్ లో కూర్చుని కోహ్లీ ఆసక్తిగా తిలకించాడు. స్మార్ట్ ఫోన్ చేతబట్టి ఫుట్ బాల్ క్రీడాకారుల విన్యాసాలను సెల్ఫీలు తీస్తూ అతడు సందడి చేశాడు. ఫుట్ బాల్ మ్యాచ్ ను వీక్షించేందుకు వచ్చిన క్రికెటర్ ను చూసి సాకర్ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కోహ్లీ ఆసక్తిగా తిలకించిన ఈ మ్యాచ్ 1-1 స్కోరుతో డ్రాగా ముగిసింది.