: చైనా రోవర్ 'యూటూ' సరికొత్త రికార్డు


చైనా రోవర్ 'యూటూ' సరికొత్త రికార్డు సృష్టించింది. చంద్రుడి ఉపరితలంపై అత్యంత ఎక్కువ కాలంగా ఉన్న రోవర్ గా 'యూటూ' రికార్డు పుటలకెక్కింది. 2013 డిసెంబర్ 1న లాంగ్ మార్చ్ 3బీ రాకెట్ ద్వారా 'యూటూ' రోవర్ ను చంద్రుడిపైకి చైనా పంపింది. అప్పటి నుంచి 'యూటూ' చంద్రుడిపైనే ఉంది. 1970లో తొలిసారి సోవియట్ యూనియన్ 'లునోఖోడ్ 1' రోవర్ ను చంద్రుడిపైకి పంపింది. ఇది 11 నెలల పాటు చంద్రుడిపై నిర్విరామంగా పనిచేసింది. దాని రికార్డును 'యూటూ' బద్దలుగొట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. రష్యా, అమెరికా తరువాత చంద్రుడిపైకి రోవర్ ను పంపిన మూడో దేశం చైనా కావడం విశేషం.

  • Loading...

More Telugu News