: తాజ్ మహల్ సౌందర్యానికి ఫేస్ బుక్ చీఫ్ ఫిదా...అనుకున్న దానికంటే అద్భుతంగా ఉందని కామెంట్
సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకెర్ బర్గ్ ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా ఉన్న తాజ్ మహల్ కు ఫిదా అయిపోయారు. మొఘల్ చక్రవర్తి తన ప్రేయసికి గుర్తుగా కట్టించిన ఈ చారిత్రక కట్టడంపై జుకెర్ బర్గ్ ఆసక్తికర కామెంట్లు చేశారు. భారత్ పర్యటనకు వచ్చిన ఆయన నిన్న ఢిల్లీ ఐఐటీ విద్యార్థులతో భేటీ తర్వాత ఆగ్రాలోని తాజ్ మహల్ సందర్శనకు వెళ్లారు. ఈ సందర్భంగా తాజ్ మహల్ ముందు నిలబడి ఫొటో తీసుకున్న జుకెర్ బర్గ్ సదరు ఫొటోను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశారు. ‘‘తాజ్... నేను అనుకున్న దానికంటే అద్భుతంగా ఉంది’’ అని సదరు పోటోకు కామెంట్ జత చేశారు.