: హైదరాబాదులో టాటా గ్రూపు చైర్మన్...టాటా మోటార్స్ డీలర్ షిప్ ను ప్రారంభించిన మిస్త్రీ


టాటా గ్రూపు సంస్థల చైర్మన్ సైరస్ మిస్త్రీ నిన్న హైదరాబాదులో ప్రత్యక్షమయ్యారు. ముందస్తు షెడ్యూల్ లేకుండానే ఆయన నేరుగా హైదరాబాదులోని గచ్చిబౌలిలో వాలిపోయారు. అక్కడ ‘వెంకటరమణ మోటార్స్’ పేరిట కొత్తగా కార్యకలాపాలు సాగించనున్న టాటా మోటార్స్ డీలర్ షిప్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. మీడియాకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే హైదరాబాదులో వాలిపోయిన మిస్త్రీ గచ్చిబౌలిలో దాదాపు గంటకు పైగానే గడిపారు. అనంతరం ఆయన తిరిగి ముంబై వెళ్లారు. హైదరాబాదులో డీలర్ షిప్ ప్రారంభోత్సవం మినహా ఎలాంటి కార్యక్రమాలకు ఆయన హాజరుకాలేదు.

  • Loading...

More Telugu News