: భారీఎత్తున ఆల్కహాల్ ను విడుదల చేస్తున్న తోకచుక్క... ఆశ్చర్యపోతున్న సైంటిస్టులు!


అది ఓ తోకచుక్క. విశ్వంలో పరిభ్రమిస్తోంది. దాని స్పెషాలిటీని చూసి సైంటిస్టులే ఆశ్చర్యపోతున్నారు. విశ్వంలో జీవం ఉనికిని తెలుసుకునేందుకు అన్వేషణలు జరుపుతున్న ఓ శాస్త్రవేత్తల బృందానికి ఇది కనిపించింది. 'లవ్ జాయ్' అనే పేరున్న ఈ తోకచుక్క పెద్ద మొత్తంలో ఆల్కహాల్ ను దానంతట అదే ఉత్పత్తి చేస్తోంది. సెకనుకు సుమారు 500 బాటిళ్ల ఇథైల్ ఆల్కహాల్ ను తయారు చేసుకుంటోంది. దీంతో ఈ తోకచుక్కపై జీవం ఆవిర్భావ రహస్యాలు ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ విషయం 'జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్' పత్రికలో ప్రచురించారు. ఈ తోకచుక్కపై ఇథైల్ ఆల్కహాల్ తో పాటు గ్లైకాల్ ఆల్డీహైడ్ సహా 21 రకాల సేంద్రీయ పదార్థాలు వాయువుల రూపంలో ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు.

  • Loading...

More Telugu News