: రూ. 54 వేల కోట్లు లాభపడ్డ భారత టాప్-7 కంపెనీలు


రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్ సహా భారత దిగ్గజ కంపెనీలు భారీగా లాభపడగా, టాప్-7 కంపెనీల సంయుక్త మార్కెట్ కాప్ రూ. 54,619 కోట్లు పెరిగింది. టాప్-10లోని ఓఎన్జీసీ, సన్ ఫార్మా, ఎస్బీఐ మినహా మిగతా అన్ని కంపెనీలూ గత వారం లాభపడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ. 14,135 కోట్లు పెరిగి, రూ. 3,09,545 కోట్లకు చేరింది. టాప్-10లో అత్యధికంగా లాభపడిన కంపెనీగా రిలయన్స్ నిలిచింది. ఇన్ఫోసిస్ మార్కెట్ కాప్ రూ. 12,587 కోట్లు పెరిగి రూ. 2.63 లక్షల కోట్లను దాటగా, టీసీఎస్ రూ. 11,871 కోట్ల లాభంతో మార్కెట్ కాప్ ను 4.99 లక్షల కోట్లకు చేర్చుకుంది. ఇతర కంపెనీల్లో ఐటీసీ రూ. 7,585 కోట్లు, హెచ్డీఎఫ్సీ రూ. 4,535 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ. 2,039 కోట్లు, కోల్ ఇండియా రూ. 1,863 కోట్లు లాభపడ్డాయి. ఇదే సమయంలో ఓఎన్జీసీ మార్కెట్ వాల్యూ రూ. 5,903 కోట్లు, ఎస్బీఐ రూ. 1,591 కోట్లు, సన్ ఫార్మా రూ. 1,034 కోట్లు నష్టపోయాయి. గతవారం సెన్సెక్స్ 256 పాయింట్లు పెరిగి 0.94 శాతం లాభంతో 27,470 పాయింట్లకు చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో భారత స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగో వారం లోనూ లాభాలను నమోదు చేసినట్లయింది.

  • Loading...

More Telugu News