: నాకు సిగ్గెక్కువ...కానీ, డ్యాన్స్ మాస్టర్ ఆ సిగ్గుని పోగొట్టారు!: అఖిల్ అక్కినేని
సాధారణంగా తాను చాలా సిగ్గరినని వర్ధమాన సినీ నటుడు అఖిల్ అక్కినేని తెలిపాడు. తొలి సినిమా 'అఖిల్' ప్రమోషన్ లో పాల్గొన్న సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ, ఈ సినిమా పరంగా తన నుంచి అభిమానులు ఎక్కువ ఆశిస్తున్నారని అన్నాడు. వారి అంచనాలు అందుకునేందుకు తగ్గట్టుగా కష్టపడ్డానని అఖిల్ తెలిపాడు. సినిమాలో హీరోయిన్ ను టీజ్ చేసే పాటలో తనను తాను కొత్తగా చూసుకున్నానని, బాగా ఎంజాయ్ చేశానని అఖిల్ చెప్పాడు. గతంలో ఎప్పుడూ అలా చేయలేదని అందుకే తనకు తాను కొత్తగా కనిపించానని, సిగ్గరినైన తనను రఘు మాస్టర్ ప్రోత్సహించి అలా చేయించారని అఖిల్ వెల్లడించాడు. సినిమాను వీలైనంత త్వరగా అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అఖిల్ తెలిపాడు.