: మంత్రగాడితో నితీష్ కుమార్... సర్వత్రా చర్చనీయాంశం
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఓ మంత్రగాడిని కలవడం చర్చనీయాంశంగా మారింది. ఈ కలయికకు సంబంధించిన వీడియో బయటకు పొక్కడంతో విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. నితీష్ ను మంత్రగాడు ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకోవడం వీడియోలో ఉంది. ఈ క్రమంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను మంత్రగాడు దూషించాడట. ఈ విషయం లాలూ వరకు పాకడంతో ఆయన స్పందించారు. తానే పెద్ద మాంత్రికుడినని లాలూ అన్నారు. మరోవైపు, ఓటమి భయంతోనే నితీష్ మంత్రగాళ్లను ఆశ్రయిస్తున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది. నితీష్ పని అయిపోయిందని తెలిపింది.