: బాబు, కేసీఆర్ ల మధ్య సీక్రెట్ డీల్... కుదిర్చింది ఎవరో త్వరలో వెల్లడిస్తాం!: టీ-కాంగ్రెస్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ల మధ్య సీక్రెట్ డీల్ కుదిరిందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డిలు ఆరోపించారు. ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన వారు, వీరిద్దరి మధ్యా మధ్యవర్తిగా నిలిచి ఒప్పందం కుదిర్చిన వ్యక్తి ఎవరన్న విషయాన్ని అతి త్వరలో బయటపెడతామని అన్నారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసుల నుంచి ఇద్దరూ తప్పించుకునేందుకే ఈ డీల్ కుదిరిందని వారు ఆరోపించారు. అమరావతి శంకుస్థాపన సమయంలో ప్రత్యేక హోదా అంశాన్ని మోదీ ప్రస్తావించకపోవడంతో తెలుగు ప్రజలు నిరాశపడ్డారని అన్నారు. విభజన సరిగ్గా లేదని మోదీ ప్రకటిస్తే, దాన్ని కేసీఆర్ వ్యతిరేకించలేదని, ఇది తెలంగాణ అమరుల త్యాగానికి అవమానమేనని వారు విమర్శించారు.