: సోనీ నుంచి ఐఫోన్ల కన్నా ఖరీదైన ఫోన్లు
యాపిల్ ఐఫోన్ల కన్నా ఖరీదైన ఫోన్లను భారత మార్కెట్లో సోనీ విడుదల చేయనుంది. రూ. 62,990 ధరలో ఎక్స్ పీరియా జెడ్5 ప్రీమియం మోడల్ ను నవంబర్ 7 నుంచి అందుబాటులోకి తేనున్నట్టు ప్రకటించింది. ఈ ఉదయం రూ. 52,990 ధరలో ఎక్స్ పీరియా జెడ్ 5ను మార్కెట్లోకి విడుదల చేసిన సంస్థ జెడ్ 5 కాంపాక్ట్ ను మాత్రం ఇక్కడ అందించబోమని స్పష్టం చేసింది. ఇండియాలో విడుదలయ్యే ఫోన్లకు ఉచితంగా సోనీ క్విక్ చార్జర్, రూ. 3,500 విలువైన స్మార్ట్ కవర్లను ఉచితంగా అందిస్తున్నామని, జెడ్5 ప్రీమియం మోడల్ ను 4వ తేదీ లోపల ముందస్తు బుకింగ్ చేసుకుంటే ఉచిత వైర్ లెస్ హెడ్ సెట్, రూ. 4 వేల విలువైన ఆన్ లైన్ కంటెంట్, రూ. 1,500 విలువైన సోనీ మ్యూజిక్ డౌన్ లోడ్ సౌకర్యాలు అందించనున్నామని తెలిపింది. వాటర్ ప్రూఫ్ సౌకర్యం ఉండే ఈ స్మార్ట్ ఫోన్లలో ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుందని వివరించింది.