: అకాల మరణం సంభవిస్తుందా? ఒక్క రక్తపు చుక్క పరీక్షతో చెప్పేస్తారట!


ఒక్క రక్తపు చుక్కను పరీక్షించడం ద్వారా, తదుపరి 14 సంవత్సరాల్లో అకాల మరణానికి గురి చేసే వ్యాధులేమైనా సంభవించే అవకాశాలు ఉన్నాయా? అన్న విషయాన్ని సులువుగా తెలిపేలా సరికొత్త పరీక్షా విధానాన్ని మెల్బోర్న్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దాదాపు 10,000 మందిని అధ్యయనంలో భాగంగా చేసి, వారికి మాలిక్యులర్ బై ప్రొడక్ట్ పరిశోధనలు చేసి రక్తంలోని 'గ్లిక్-ఏ' పరిమాణాన్ని గుర్తించారు. ఇది ఎంత ఎక్కువగా ఉంటే, వారిలో అంత అకాల మరణానికి అవకాశాలు ఉన్నట్టని వర్సిటీ శాస్త్రవేత్త మైకెల్ ఇనోయ్ వెల్లడించారు. తక్కువ స్థాయి క్రానిక్ ఇన్ఫెక్షన్ లేదా ఔషధాలు తీసుకుంటే శరీరం అతిగా స్పందించడం వీరిలో ఎక్కువగా కనిపించిందని తెలిపారు. దీనివల్ల శరీరంలోని వివిధ అవయవాలు త్వరగా నశిస్తాయని పేర్కొన్నారు. దీంతో అకాల మరణం దగ్గరవుతుందని తెలిపారు. ఇక గ్లిక్-ఏపై మరింత పరిశోధనలను సాగించనున్నామని వివరించారు. ఈ అధ్యయనం 'సెల్ సిస్టమ్స్' జర్నల్ లో ప్రచురింతమైంది.

  • Loading...

More Telugu News