: నాలుగో వన్డేలో భారత్ విజయం...రసవత్తరంగా మారిన సిరీస్

భారత్-సౌతాఫ్రికా మధ్య ప్రారంభమైన మహాత్మ గాంధీ-నెల్సన్ మండేలా ద్వైపాక్షిక సిరీస్ రసవత్తరంగా మారింది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న నాలుగోవన్డేలో భారత జట్టు 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లీ (138) సెంచరీతో రాణించగా అతనికి రైనా (53), రహానే (45) చక్కని సహకారమందించారు. అనంతరం 300 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా జట్టు డికాక్ (43), డివిలియర్స్ (112) సెంచరీతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ మూడు, హర్భజన్ రెండు, అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్, మోహిత్ శర్మ చెరో వికెట్ తీశారు. దీంతో భారత జట్టు 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు. కాగా, సిరీస్ 2-2తో సమానమైంది. ఇంకో మ్యాచ్ మిగిలి ఉండడంతో సిరీస్ ఫలితంపై ఆసక్తి పెరుగుతోంది.

More Telugu News