: ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రత్యేక హోదా సాధన సమితి ఆందోళన
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రత్యేక హోదా సాధన సమితి ఆందోళణ నిర్వహిస్తోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆందోళనలో ప్రత్యేకహోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ప్రకటించకుండా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలను దగా చేశారని అన్నారు. మోదీ, ఆయన అనువాదకుడు వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో మట్టికొట్టి, యమునా నది నీటిలో ముంచేశారని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ కు తక్షణం ప్రత్యేకహోదా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.