: సిక్సర్ తో సెంచరీ పూర్తి చేసిన కోహ్లీ... టీమిండియా 210/3
తమిళనాడు రాజధాని చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ (101) సెంచరీతో రాణించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి దిగిన కోహ్లీ, రహానే (45) ఆచి తూచి ఆడారు. కోహ్లీ కాస్త దూకుడు ప్రదర్శించినప్పటికీ, రహానే నిలదొక్కుకునేందుకు ప్రాధాన్యతనిచ్చాడు. అర్ధ సెంచరీకి చేరువలో రహానేను స్టెయిన్ అవుట్ చేయడంతో, కోహ్లీకి రైనా (25) జతకలిశాడు. వీరిద్దరూ ఆచి తూచి ఆడుతూనే అవకావం వచ్చిన ప్రతిసారీ భారీ షాట్లు కొడుతున్నారు. దీంతో టీమిండియా స్కోరు బోర్డులో కదలిక వచ్చింది. 38 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్లు కోల్పోయిన భారత జట్టు 210 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో రబడా, మోరిస్, స్టెయిన్ చెరో వికెట్ తీసి రాణించారు.