: కోహ్లీ అర్ధసెంచరీ...నిలకడగా రహానే

టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగో వన్డేలో రాణించాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగుతున్న నాలుగో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ఆదిలోనే ఓపెనర్లను కోల్పోయింది. ధావన్ (7) మరోసారి దారుణంగా విఫలం కాగా, ఎన్నో అంచనాలు మోస్తున్న రోహిత్ శర్మ (21) కూడా పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ (55) అర్ధ సెంచరీతో రాణించగా, అతనికి అజింక్యా రహానే (35) చక్కని సహకారమందిస్తున్నాడు. దీంతో 22 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా 121 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో రబడా, మోరిస్ చెరో వికెట్ తీసి రాణించారు.

More Telugu News