: కేసీఆర్! మనం కలసి ముందుకెళదాం: చంద్రబాబు

అమరావతి వేదికపై నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ, తెలంగాణలు తెలుగు మాట్లాడే రాష్ట్రాలని... కలసికట్టుగా ముందుకు సాగితే మెరుగైన అభివృద్ధిని సాధించవచ్చని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమతో కలసి రావాలని కోరారు. ఆహ్వానించగానే అమరావతికి వచ్చినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజులాగానే భవిష్యత్తులో కూడా కేసీఆర్ కలసికట్టుగా ఉండాలని అభిలషించారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించుకునే దిశగా ముందుకుసాగుదాం అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా, సరే అన్నట్టు కేసీఆర్ తల ఆడించారు.

More Telugu News