: విజయవాడ చేరుకున్న గవర్నర్... ప్రాంగణానికి చేరుకున్న రామోజీరావు
తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికారు. మరోవైపు రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అమరావతి శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రామోజీకి టీడీపీ నేతలు సాదర స్వాగతం పలికారు. ఆయనకు కేటాయించిన సీటు వద్దకు దగ్గరుండి తీసుకెళ్లారు. ఈ క్రమంలో, ప్రాంగణ ఏర్పాట్లను పరిశీలిస్తూ రామోజీ ముందుకు కదిలారు.