: గోదావరి ఖనిలో కాల్పుల కలకలం
తెలంగాణలోని కరీంనగర్ జిల్లా గోదావరి ఖనిలో కాల్పుల కలకలం రేగింది. రౌడీ షీటర్ చందు పోలీసులపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపారు. అనంతరం పోలీసులు చందును అదుపులోకి తీసుకున్నారు. కాగా, రౌడీ షీటర్ చందుపై పలు కేసులు ఉన్నాయి. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.