: మిజోరాంలో 104 ఏళ్ల వృద్ధురాలు మృతి
శతాధిక వృద్ధురాలు రంగచింగ్ పులి (104) బుధవారం మృతి చెందింది. ఐజ్వాల్ లోని వైవకాన్ లో ఆమె మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. వయస్సు పైబడిన కారణంగానే ఆమె మృతి చెందిందన్నారు. రంగచింగ్ పులి భర్త జోబెలా గతంలో మృతి చెందారు. శతాధికి వృద్ధురాలి కుటుంబం చాలా పెద్దది. 10 మంది సంతానం. 42 మంది మనవళ్లు, 102 మంది మునిమనవళ్లు, 45 మంది గ్రాండ్ గ్రాండ్ సన్స్ ఉన్నారని ఆమెకు కుటుంసభ్యులు తెలిపారు.