: స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 19 పాయింట్లు నష్టపోయి 27,287కు పడిపోయింది. నిఫ్టీ 10 పాయింట్లు కోల్పోయి 8,251 వద్ద స్థిరపడింది. హిందుస్థాన్ కన్ స్ట్రక్షన్ కంపెనీ, ఎంఫాసిస్, జుబిలెంట్ లైఫ్ సైన్సెస్, శ్రీరేణుకా షుగర్స్, క్యాస్ట్రాల్ ఇండియాలు నేటి ట్రేడింగ్ లో టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఫెడరల్ బ్యాంక్, ఎస్ఆర్ఈఐ ఇన్ ఫ్రా, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్ ఫైనాన్స్, పీఎంసీ ఫిన్ కార్ప్ లు టాప్ లూజర్స్ గా ఉన్నాయి.