: బీజేపీ ప్రధానులపై శివసేన వ్యంగ్యంతో కూడిన ప్లెక్సీలు...తొలగించిన పోలీసులు
మహారాష్ట్రలో మిత్రపక్షాలు బీజేపీ, శివసేన మధ్య దూరం పెరుగుతోంది. బీజేపీ మద్దతిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని శివసేన అడ్డుకుంటోంది. మాంసం నిషేధం దగ్గర్నుంచి పాక్ కళాకారులు, క్రీడా ప్రముఖులు, సినీ నటులను అడ్డుకోవడం వరకు శివసేన లక్ష్యం బీజేపీ నిర్ణయాలను అడ్డుకోవడమే. ఈ నేపథ్యంలో తాజాగా మరాఠా గడ్డపై మరో వివాదం రాజుకుంది.
ముంబై ప్రధాన కూడళ్లలో శివసేన పలు ప్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఈ ప్లెక్సీలలో... "గతం మర్చిపోయారా? మీ లాంటి గర్విష్టులంతా ఒకప్పుడు ఠాక్రే పాదాల ముందు తల వంచిన రోజులని విస్మరించారా?" అంటూ బాల్ ఠాక్రే ముందు వాజ్ పేయి, అద్వానీ, రాజ్ నాథ్ సింగ్, మోదీ వంగి నమస్కరిస్తున్న ఫోటోలు పెట్టారు. దీంతో బీజేపీ, శివసేన మధ్య విభేదాలు చెలరేగే అవకాశం ఉందని పోలీసులు వాటిని తొలగించారు. తాజా ప్లెక్సీలతో రెండు పార్టీల మధ్య మరింత దూరం పెరిగినట్టు తెలుస్తోంది.