: ఇంట్లో పెద్దోడిగా పుడితే త్వరగా కంటి సమస్యలు!
ఓ ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే, రెండో సంతానం కన్నా, మొదటి సంతానానికే 20 శాతం వరకూ కంటి సంబంధ సమస్యలు అధికంగా వస్తున్నాయట. ఇటీవల కార్డిఫ్ యూనివర్శిటీ నిర్వహించిన అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తొలి బిడ్డ బాగా చదువుకోవాలని తల్లిదండ్రులు అధికంగా ఒత్తిడి తీసుకురావడమే ఇందుకు ప్రధాన కారణమని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఎక్కువగా పుస్తకాలను చదవడం వల్ల వీరిలో కంటి సమస్యలు ముందుగానే వస్తున్నాయని తేలింది. కాగా, చురుకుదనం విషయంలో మాత్రం పెద్దవాళ్ల కన్నా, చిన్నోళ్లు ముందుంటారన్న సంగతి తెలిసిందే. తొలి బిడ్డపై పెట్టినంత శ్రద్ధ తరువాతి వారిపై పెట్టకపోవడమే ఇందుకు కారణమని, వారంతట వారుగా పెరిగే సమయం ఎక్కువగా ఉన్నందున వారిలో చురుకుదనం అధికమని పలు రీసెర్చ్ లు వెల్లడించాయి.