: కెనడా పార్లమెంట్ ఎన్నికల కోసం ఓ అభ్యర్థి గ్రాఫిక్స్ తో వినూత్న ప్రచారం... నెట్టింట్లో సూపర్ హిట్టయిన వీడియో మీకోసం!


ఎన్నికల్లో తమకు ఓట్లడుగుతూ అభ్యర్థులు వినూత్న రీతిలో ప్రచారం చేస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. కెనడాలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న వేళ వయోట్ స్కాట్ అనే వ్యక్తి ఇండిపెండెంటుగా పోటీలోకి దిగాడు. తన ప్రచారం కోసం గ్రాఫిక్స్ తో కూడిన ట్రయిలర్ ను రూపొందించగా, అది సామాజిక మాధ్యమాల్లో సూపర్ హిట్టయింది. ఓ పక్షిపై ఆకాశంలో ప్రయాణిస్తూ, కత్తి దూస్తూ కిందకు దూకడం, కన్జర్వేటివ్ పార్టీ తరఫున పోటీలో ఉన్న వారిని గ్రహాంతర వాసులుగా చూపుతూ వారిని కంటి చూపుతో కాల్చేయడం, పైనుంచి పడుతున్న అమ్మాయిని ఒడిసి పట్టుకోవడం వంటి దృశ్యాలున్నాయి. ఈ వీడియోను చూసి ఆనందించిన వారిలో ఎంతమంది స్కాట్ కు ఓటేస్తారో మరి!

  • Loading...

More Telugu News