: భుట్టో హత్యకు ముషార్రఫ్ కారణం: పాక్ కోర్టుకు అమెరికన్ జర్నలిస్ట్ సాక్ష్యం

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి బేనజీర్ భుట్టో హత్యకు మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ కూడా కారణమేనని అమెరికన్ జర్నలిస్టు మార్క్ సీగెల్ సాక్ష్యమిచ్చారు. రావల్పిండి కోర్టులో కేసును విచారిస్తుండగా, అమెరికాలోని పాకిస్థాన్ ఎంబసీకి వచ్చిన మార్క్, అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో తన వాగ్మూలాన్ని ఇచ్చారు. అప్పట్లో బేనజీర్ తన ప్రాణాలను హరించే కుట్ర జరుగుతోందని, ఫారిన్ సెక్యూరిటీని పెట్టుకునేందుకు అనుమతించాలని పలుమార్లు కోరినా ముషార్రఫ్ పట్టించుకోలేదని తెలిపారు. ముషార్రఫ్ కు దగ్గరి అనుచరులైన ముగ్గురు భుట్టో హత్యకు కుట్ర చేస్తూ మాట్లాడుకున్న ఫోన్ కాల్ ను గల్ఫ్ నిఘా సంస్థ ట్రేస్ చేసిందని ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న మార్క్ తెలిపారు. భుట్టోపై దాడి జరిగిన సమయంలో మొబైల్ జామర్లు పని చేయలేదని గుర్తు చేశారు. కాగా, డిసెంబర్ 2007లో ఆమెపై దాడి జరిగిన సంగతి తెలిసిందే.

More Telugu News