: రైళ్లలో చోటు లేదు... బస్సులు ఖాళీ లేవు!

దసరా సెలవులకు సొంత ఊరికి వెళ్లి వద్దామని భావించే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. దసరా వేడుకల నిమిత్తం శనివారం నాడు హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తమతమ ప్రాంతాలకు బయలుదేరి వెళ్లారు. దీంతో నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ ప్రాంతాల నుంచి బయలుదేరే రైళ్లు కిటకిటలాడాయి. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, బెంగళూరు, చెన్నై, తిరుపతి ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో రద్దీ అత్యధికంగా ఉంది. రిజర్వేషన్లు దొరకక జనరల్ బోగీల్లో అయినా ప్రయాణించేందుకు ప్రజలు పోటీ పడ్డారు. మరోవైపు ఆర్టీసీ స్పెషల్ బస్సుల పేరిట 50 శాతం అదనపు వసూళ్లను మొదలు పెట్టింది. రెగ్యులర్ బస్సుల్లో ఖాళీలు లేవని, అధిక రేట్లు పెట్టారని, ఈ చార్జీలు చూస్తుంటే గుండె దడదడలాడుతోందని ప్రయాణికులు వాపోతున్నారు.

More Telugu News