: శంకుస్థాపనకు వస్తానన్న అక్బరుద్దీన్ ఒవైసీ

అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తప్పకుండా వస్తానని తెలంగాణలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు ఈ రోజు అక్బరుద్దీన్ ను వ్యక్తిగతంగా కలసి ఆహ్వానపత్రికను అందజేశారు. శంకుస్థాపనకు హాజరు కావాలని ఈ సందర్భంగా అక్బర్ ను కోరారు. హైదరాబాదులో ఉన్న రాజకీయ ప్రముఖులకు ఏపీ ప్రభుత్వం ఆహ్వానపత్రికలు అందజేస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News