: ఢిల్లీలో ఈ నెల 31 నుంచి శ్రీవారి వైభవోత్సవ కార్యక్రమాలు
దేశ రాజధాని ఢిల్లీలో శ్రీవారి వైభవోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నెల 31 నుంచి అక్టోబర్ 8 వరకు వైభవోత్సవాలు నిర్వహిస్తామని టీటీడీ జేఈవో భాస్కర్ తెలిపారు. ఇందుకోసం టీటీడీ, స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పారు. తిరుమలలో శ్రీవారికి చేసే అన్ని సేవలను సామాన్యులు సైతం చూసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. ఢిల్లీ వాసులకు శ్రీవారి దర్శనం కల్పించాలన్న ఉద్దేశంతోనే వైభవోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని భాస్కర్ తెలిపారు. ఒకేసారి 15వేల మంది భక్తులు కూర్చునేలా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.