: చంద్రబాబు, లోకేశ్ జైలుకెళ్లడం ఖాయం: రవీంద్రనాథ్ రెడ్డి

అమరావతి పేరుతో చంద్రబాబు నిర్మిస్తున్నది ఏపీ రాజధాని కాదని... అదొక మాయాబజార్ అని వైకాపా ఎమ్మెల్యే, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. వైకాపా పిలుపు మేరకు కడప కలెక్టరేట్ వద్ద ప్రత్యేక హోదా కోసం రిలే దీక్షలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా ఈ దీక్షలను ప్రారంభించారు. ఈ శిబిరాన్ని రవీంద్రనాథ్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజధాని పేరుతో రూ. 1.50 లక్షల కోట్ల కుంభకోణం జరగబోతోందని చెప్పారు. ఈ వ్యవహారంలో భవిష్యత్తులో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు.

More Telugu News