: పవన్ కల్యాణ్ కు అమరావతి అహ్వానం...అందజేసిన ఏపీ మంత్రులు కామినేని, అయ్యన్న
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు రావాలని జనసేన అధినేత, టాలీవుడ్ అగ్ర నటుడు పవన్ కల్యాణ్ కు కొద్దిసేపటి క్రితం ఆహ్వాన పత్రిక అందింది. నిన్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్వయంగా పవన్ కల్యాణ్ కు ఫోన్ చేసి శంకుస్థాపనకు తప్పనిసరిగా రావాలని ఆహ్వానించారు. తాజాగా అమరావతి ఆహ్వాన పత్రికలతో హైదరాబాదు చేరుకున్న ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, చింతకాయల అయ్యన్నపాత్రుడు, టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ లు పవన్ కల్యాణ్ ను కలిశారు. శంకుస్థాపనకు రావాలని పవన్ కల్యాణ్ ను కోరిన వారు ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు.