: తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్ ఇదే


ఏపీ రిజిస్ట్రేషన్ తో ఉన్న వాహనాల కోడ్ ను టీఎస్ గా మార్చుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కోడ్ మార్పుకు నాలుగు నెలల గడువును ప్రభుత్వం విధించింది. ఈ క్రమంలో ఆదిలాబాద్, హైదరాబాద్ వాహనాలకు ఏపీ స్థానంలో టీఎస్ చేర్చితే సరిపోతుంది. మిగతా జిల్లాలకు కోడ్ మారుతుంది. త్వరలోనే విధివిధానాలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో, తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 76 లక్షల వాహనాల కోడ్ మారబోతోంది. వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సిరీస్ కింద విధంగా ఉంటుంది. టీఎస్ 1 - ఆదిలాబాద్ టీఎస్ 2 - కరీంనగర్ టీఎస్ 3 - వరంగల్ టీఎస్ 4 - ఖమ్మం టీఎస్ 5 - నల్గొండ టీఎస్ 6 - మహబూబ్ నగర్ టీఎస్ 7, 8 - రంగారెడ్డి టీఎస్ 9, 10, 11, 12, 13, 14 - హైదరాబాద్ టీఎస్ 15 - మెదక్ టీఎస్ 16 - నిజామాబాద్.

  • Loading...

More Telugu News