: బీబీసీ వెబ్ సైట్ క్రాష్... కుట్రేనంటూ సోషల్ మీడియాలో వదంతులు
ప్రపంచంలో కోట్లాది మందితో నిత్యం రద్దీగా ఉండే బీబీసీ, ఉబెర్, నెట్ ప్లిక్స్, ద ఎకానమిస్ట్, అమెరిట్రేడ్ తదితర సంస్థల వెబ్ సైట్లన్నీ ఉన్నట్లుండి క్రాష్ అయ్యాయి. కాసేపటికే వీటిలోని చాలా సైట్లు మళ్లీ సాధారణంగా పనిచేయడం ప్రారంభించినా, ఇందుకు దారి తీసిన కారణాలు మాత్రం వెల్లడి కాలేదు. ఈ వెబ్ సైట్ల క్రాషింగ్ వెనుక కుట్ర కోణం దాగుందని సోషల్ మీడియాలో వదంతులు ఊపందుకున్నాయి. అయితే క్లౌడ్ సర్వీసుల్లో సాంకేతిక లోపం కారణంగానే ఈ సైట్లు క్రాష్ అయ్యాయని ప్రాథమిక సమాచారం. దీనిపై స్పందించిన నెట్ ప్లిక్స్ తమ వెబ్ సైట్ ఒక్క డెస్క్ టాపుల్లోనే కాక ల్యాప్ టాప్, మొబైల్, ట్యాబ్ తరహా అన్ని డివైజ్ లలోనూ క్రాష్ అయిందని తెలిపింది. అల్ట్రా డీఎన్ఎస్ క్లౌడ్ సర్వీసులో సాంకేతిక సమస్య కారణంగానే తమకు ఇబ్బంది ఎదురైందని ఆ సంస్థ ప్రతినిధి జోరిస్ ఎవర్స్ తెలిపారు.