: అమరావతిలో ప్రతిష్టించేందుకు మహిమాన్విత యంత్రాలు


నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ఎటువంటి విఘ్నాలు కలగకుండా యంత్రాలు తెచ్చారు. ఈ యంత్రాలకు విజయవాడ కనకదుర్గ గుడిలో పూజలు చేయించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. రాజధాని నిర్మాణపు పనులకు ఆటంకం కల్గకుండా సవ్యంగా సాగేందుకు ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ నుంచి 21 మహిమాన్విత యంత్రాలను తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు. ఈ నెల 19వ తేదీన ఇంద్రకీలాద్రిలోని దుర్గమ్మ గుడిలో ఈ యంత్రాలకు పూజలు నిర్వహించి అమరావతిలో ప్రతిష్టిస్తామని మాణిక్యాలరావు వివరించారు.

  • Loading...

More Telugu News