: క్యాంపస్ రిక్రూట్ మెంట్ల ద్వారా 20 వేల మందిని విధుల్లోకి తీసుకోనున్న ఇన్ఫీ... వేతనం ఇదే!


ఈ సంవత్సరం క్యాంపస్ రిక్రూట్ మెంట్ల ద్వారా 20 వేల మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకోనున్నట్టు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వెల్లడించింది. వీరికి సాలీనా రూ. 3.25 లక్షల ప్రారంభ వేతనం ఉంటుందని తెలిపింది. గత సంవత్సరం ఆఫర్ చేసిన వేతనాన్ని అలాగే కొనసాగించనున్నట్టు దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా ఉన్న ఇన్ఫీ వెల్లడించింది. అయితే, ఉద్యోగుల శిక్షణా స్టైపెండ్ ను ప్రస్తుతమున్న రూ. 4 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతున్నామని తెలిపింది. కొత్తగా చేరే ఉద్యోగులకు ఐదు నుంచి ఆరు నెలల పాటు శిక్షణ ఉంటుందని సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావు వెల్లడించారు. ఇన్ఫీలో ఉద్యోగాలను వీడి వెళుతున్న వారి సంఖ్య జూలైతో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే ఆగస్టు-అక్టోబరు మధ్య కాలంలో 14.2 శాతం నుంచి 14.1 శాతానికి తగ్గిందని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News