: గొల్లపూడిలో మట్టి, నీరు సేకరించిన మంత్రి ఉమా
ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో ప్రతి ఊరు, ప్రతి గ్రామం యొక్క భాగస్వామ్యం ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మట్టి-నీరు సేకరణ కార్యక్రమం మొదలైంది. ఇందులో భాగంగా విజయవాడలోని తన నివాస స్థలం గొల్లపూడిలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మట్టి, నీరు సేకరించారు. ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన తరువాత అధికారులకు అప్పగించనున్నారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని పోలీసులైన్స్ అయ్యప్పస్వామి ఆలయంలో మంత్రి యనమల రామకృష్ణుడు గోపూజ నిర్వహించారు. అనంతరం రాజధాని నిర్మాణానికి మట్టి, నీరు సేకరణను ప్రారంభించారు.