: జగన్ కు వైద్యం అందిస్తున్నాం: జీజీహెచ్ సూపరింటెండెంట్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కార్డియాలజీ విభాగంలో వైద్యం అందిస్తున్నామని జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజునాయుడు తెలిపారు. అన్ని పరీక్షలు నిర్వహించామని, 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని చెప్పారు. ఆయనకు పల్స్ రేట్ క్రమంగా మెరుగుపడుతోందని, చికిత్సకు జగన్ సహకరిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. కాగా జగన్ ను పరామర్శించేందుకు తల్లి విజయలక్ష్మి, సతీమణి భారతి, సోదరి షర్మిల ఆసుపత్రికి వచ్చారు. వైద్యానికి సహకరించాలని వారు కోరినప్పటికీ నిరాకరించారు. తనకు ఫ్లూయిడ్స్ వద్దని, ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగిస్తానని వైద్యులకు జగన్ స్పష్టం చేశారు. అయినప్పటికీ బలవంతంగా వైద్యులు ఫ్లూయిడ్స్ ఎక్కించారు.