: రచయిత సుధీంద్ర కులకర్ణిపై దాడి ఘటనలో శివసేన కార్యకర్తలు అరెస్ట్

రచయిత, అబ్జర్వర్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఛైర్మన్ సుధీంద్ర కులకర్ణి ముఖంపై ఇంకు పులిమి, దాడికి పాల్పడిన వారిపై ముంబై పోలీసులు చర్యలు తీసుకున్నారు. తనపై జరిగిన దాడిపై కులకర్ణి నిన్ననే (సోమవారం) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసి, ఈ ఉదయం ఆరుగురు శివసేన కార్యకర్తలను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పాకిస్థాన్ మాజీ మంత్రి ఖుర్షీద్ మహ్మద్ కసూరి రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని కులకర్ణి నిర్వహించారు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన శివసేన కార్యకర్తలు కులకర్ణిపై నలుపు రంగు సిరా పోసి తీవ్రంగా అవమానించారు. ఈ ఘటనను పలు పార్టీల నేతలు కూడా ఖండించారు.

More Telugu News